News March 17, 2024
లోక్ సభ పోరు.. NGKL కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహబూబ్ నగర్ పరిధిలో BRS, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. అటూ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి తేలాల్సి ఉంది. ఇక్కడ BRS, కాంగ్రెస్ అభ్యర్థులపై స్పష్టత వస్తే ప్రచారం ఊపందుకోనుంది.
Similar News
News January 29, 2026
అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాలి: MBNR కలెక్టర్

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బుధవారం ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవితో కలిసి కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే ముందు అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జతచేయాలో చెక్ లిస్ట్ స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాలని సూచించారు.
News January 28, 2026
విద్యుత్ కాంతులతో మన్యంకొండ ముస్తాబు

మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.
News January 28, 2026
కురుమూర్తి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు ప్రారంభం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ శివారులో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు దాతల సహకారంతో బుధవారం ప్రారంభించారు. దేవాలయం ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సత్యనారాయణ, శ్రీనివాసులు ఆలయ సిబ్బంది ఆర్.శివానంద చారి, భాస్కర చారి తెలుగు శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


