News March 20, 2024

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈనెల 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 19న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది.

Similar News

News October 1, 2024

DSC: నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: డీఎస్సీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ తీసుకుని, వాటి ఆధారంగా పోస్టింగ్స్ ఇస్తారు.

News October 1, 2024

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఎంతంటే?

image

TG: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా ఈ ఏడాది ₹93,750 చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం 42,000 మంది కార్మికులకు ఈ బోనస్ వర్తించనుంది. గత ఏడాది ₹85,500 చెల్లించగా, ఈసారి అదనంగా ₹8,250 ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది సంస్థ సాధించిన లాభాల్లో 33% కార్మికులకు చెల్లించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన డబ్బులు ఈనెల 7న కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.

News October 1, 2024

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ అనే ఫీచర్ రానుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌లో ‘రిమైండర్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే యూజర్లకు అన్‌సీన్ స్టేటస్‌ల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. దీని వల్ల రెగ్యులర్‌గా స్టేటస్‌లు చూడని వారు, కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే వారు ముఖ్యమైన అప్‌డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫేవరెట్/ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్స్ స్టేటస్‌లపైనే ఇది ఫోకస్ చేస్తుందని సమాచారం.