News April 26, 2024

లోక్‌సభ ఎలక్షన్స్ ఖర్చు ₹1.35లక్షల కోట్లు?

image

భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల వ్యయం ₹1.35లక్షల కోట్లకు చేరుకుంటుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ సంస్థ గత 35 ఏళ్లుగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ వస్తోంది. 2019 ఎన్నికల వ్యయం ₹60వేల కోట్లు కాగా, ప్రస్తుత ఎలక్షన్స్ కి అంతకు రెట్టింపు ఖర్చవుతోందని చెబుతోంది.

Similar News

News January 28, 2026

80 గంటల్లో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణం

image

మహారాష్ట్ర రాజకీయాల్లో 2019 నవంబరులో ఏర్పాటైన ’80 గంటల ప్రభుత్వం’ అజిత్ పవార్‌కు రాజకీయాలలో కీలక ఘట్టం. నాటకీయ పరిణామాల నడుమ అర్ధరాత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి Dy.CMగా పవార్ ప్రమాణం చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 80 Hrsలోనే ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆయన తిరిగి NCPకి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

News January 28, 2026

ఈయూతో డీల్.. భారత్ సాధించిన గొప్ప విజయం: US ట్రేడ్ ప్రతినిధి

image

ఇండియా-EU మధ్య కుదిరిన <<18973407>>ఒప్పందం<<>>పై US ట్రేడ్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ప్రశంసలు కురిపించారు. ‘డీల్‌‌లోని కొన్ని అంశాలు చదివాను. ఇండియాకు అనుకూలంగా కనిపిస్తోంది. యురోపియన్ మార్కెట్లో విస్తృత అవకాశాలు దక్కుతాయి. డీల్ అమల్లోకి వచ్చాక ఆ దేశానికి గొప్ప విజయంగా నిలవబోతోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత వర్కర్లు యూరప్‌కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు.

News January 28, 2026

వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.