News March 20, 2024

లోక్ సభ ఎలక్షన్స్: భువనగిరి నుంచి సీపీఎం పోటీ?

image

TG: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని సీపీఎం యోచిస్తోంది. మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలలో ఒకరిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికతో పాటు రాష్ట్రంలోని మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపై పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Similar News

News January 18, 2026

‘నారీ నారీ నడుమ మురారి’ కలెక్షన్లు ఎంతంటే?

image

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదలైన మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఆఖరి సినిమాగా విడుదలై హిట్ టాక్ వచ్చినా థియేటర్ల కొరత ఉండటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. రేపటి నుంచి థియేటర్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మీరు ఈ మూవీ చూశారా?

News January 18, 2026

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

image

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.

News January 18, 2026

రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారింది: మాజీ మంత్రి

image

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.