News June 4, 2024
లోక్‌సభ స్థానాలు.. ఎవరికి ఎన్ని సీట్లంటే?
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 286 సీట్లు సాధించింది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 196 సీట్లలో గెలించింది. మరో 3 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇతరులు 50 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా.. ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని గంటల్లో క్లియర్ పిక్చర్ రానుంది.
Similar News
News November 29, 2024
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.
News November 29, 2024
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు
TG: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో DEC 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో 30వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.
News November 29, 2024
నేటి నుంచి U-19 ఆసియా కప్
నేటి నుంచి యూఏఈ వేదికగా అండర్-19 ఆసియా కప్ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడనున్నాయి. గ్రూప్-Aలో భారత్, జపాన్, పాకిస్థాన్, యూఏఈ, గ్రూప్-Bలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఉన్నాయి. ఇవాళ బంగ్లాదేశ్-అఫ్గానిస్థాన్, నేపాల్-శ్రీలంక మధ్య పోరు జరగనుంది. రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంది.