News June 26, 2024
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక: NDAకు వైసీపీ మద్దతు

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో NDA అభ్యర్థి ఓం బిర్లాకు YCP మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ YV సుబ్బారెడ్డి ప్రకటించారు. ఓం బిర్లాకు మద్దతివ్వాలని NDA అగ్రనేతలు YCP అధినాయకత్వాన్ని కోరారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా NDAకు మద్దతిస్తున్నామన్నారు. స్పీకర్ పదవి కోసం TDP పట్టుబడితే మద్దతిస్తామన్న కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. అందుకే ఇండియా కూటమికి మద్దతివ్వట్లేదన్నారు.
Similar News
News April 4, 2026
ఇవాళ, రేపు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.
News April 4, 2026
ALERT: ఇవాళ వర్షాలు

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
News April 4, 2026
ఏప్రిల్ 6న ₹500కోట్ల ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

TG: ఈనెల 6న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ₹500కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ₹300కోట్ల వ్యయంతో చేపట్టనున్న బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో ₹200కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు.


