News June 12, 2024
ఈ నెల 24న కొలువుదీరనున్న లోక్సభ: కిరణ్ రిజిజు
ఈ నెల 24న 18వ లోక్సభ కొలువుదీరనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. జులై 3వరకు జరిగే సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ముఖ్య అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. 264వ రాజ్యసభ సెషన్ ఈ నెల 27న ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అదే రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.
Similar News
News December 23, 2024
విష్ణుతో ప్రాణహాని.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు!
TG: మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా తన సోదరుడు విష్ణుతో పాటు అతని అనుచరుడు వినయ్పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
News December 23, 2024
ఈ నెల 30న క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.
News December 23, 2024
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ను KIMS వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్లో వివరించారు.