News October 6, 2025
₹300Cr క్లబ్‌లోకి ‘లోక: ఛాప్టర్-1’.. OTTలోకి ఎప్పుడంటే?

కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ‘లోక: ఛాప్టర్-1’ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా OTTకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Similar News
News March 9, 2026
క్విజ్‌లో పాల్గొనండి.. రూ.25వేలు గెలుచుకోండి!

భారత జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం <
News March 9, 2026
మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించబోం: CBN

AP: గత ఐదేళ్లూ కల్తీ, కుంభకోణాలు చేశారని CM చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల(D) కొత్తబురుజులో మాట్లాడుతూ కల్తీ మద్యంతో వేల మంది మరణానికి వైసీపీ నేతలు కారణమయ్యారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రపూరితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News March 9, 2026
తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

తిన్న తర్వాత బాడీ ‘డైజెషన్ మోడ్’లోకి వెళ్తుంది. రక్తం అంతా పొట్ట దగ్గరకు చేరి ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. అలాంటి టైమ్‌లో వెంటనే స్నానం చేస్తే బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయి.. కడుపు ఉబ్బరం, హెవీనెస్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. అందుకే తిన్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేస్తే బెస్ట్.


