News April 11, 2024

తమిళనాడులో లోకేశ్ ప్రచారం

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో లోకేశ్ రోడ్‌షోల్లో పాల్గొంటారు. అనంతరం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.

Similar News

News November 24, 2025

బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

image

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

News November 24, 2025

ధర్మేంద్ర గురించి తెలుసా?

image

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్‌ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.

News November 24, 2025

ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>పట్నా 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in