News March 23, 2025
స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్ ఫ్యామిలీ

AP: మంత్రి లోకేశ్ కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 25, 2025
మరో చోటుకు తిహార్ జైలు తరలింపు

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును ఢిల్లీ సరిహద్దుల్లోకి మార్చనున్నట్లు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రకటించారు. కొత్త జైలు నిర్మాణం కోసం సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. 400 ఎకరాల విస్తీర్ణంలో తిహార్ జైలును 1958లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 13వేల మంది ఖైదీలు ఉన్నట్లు అంచనా. తొలుత ఇది పంజాబ్ అధీనంలో ఉండగా 1966లో ఢిల్లీ ప్రభుత్వం టేకోవర్ చేసింది.
News March 25, 2025
ప్రియుడి కోసం.. పెళ్లైన 2 వారాలకే భర్తను చంపించిన భార్య

భర్తలను భార్యలు చంపేస్తున్న/చంపిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మీరట్ కేసు మరువక ముందే UP, మైన్‌పురి జిల్లాలో మరో ఘోరం జరిగింది. బలవంతపు పెళ్లి, ప్రియుడిపై ఇష్టంతో పెళ్లైన 2 వారాలకే భర్త దిలీప్ యాదవ్‌ను కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించింది ప్రగతీ యాదవ్. తన భర్త వద్ద బాగా ఆస్తి ఉందని, చంపేశాక సుఖంగా బతకొచ్చని ప్రియుడికి చెప్పింది. దిలీప్ శవం దొరికాక పోలీసుల దర్యాప్తుతో ప్రగతి ప్లాన్ బయటకొచ్చింది.
News March 25, 2025
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

మోహన్ లాల్ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.