News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News July 10, 2025

విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

image

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు.

News July 10, 2025

చరిత్ర సృష్టించారు.. ఇంగ్లండ్‌పై తొలి టీ20 సిరీస్ కైవసం

image

ఇంగ్లండ్ ఉమెన్-టీమిండియా ఉమెన్ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఇంకో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 127 పరుగుల లక్ష్యాన్ని 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. ఇంగ్లండ్‌ ఉమెన్‌పై మనకు ఇదే తొలి సిరీస్ విజయం. ఇరు దేశాల మధ్య 6 ద్వైపాక్షిక సిరీస్లు జరగ్గా.. అన్నింటినీ ఇంగ్లండే గెలిచింది. రాధ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.

News July 10, 2025

అనుపమ చిత్రంపై వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

image

అనుపమ, సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే జానకిvs స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీకి సెన్సార్ బోర్డు హీరోయిన్ పేరు మార్పు సహా 96 కట్స్ చెప్పింది. దీనిపై నిర్మాతలు కోర్టుకెళ్లగా సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండే మార్పులు చెప్పింది. మూవీ పేరును వి.జానకిvs స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టు సీన్‌లో ఒకచోట హీరోయిన్ పేరు మ్యూట్ చేయాలంది. మూవీ టీమ్ అభిప్రాయం తెలియజేయాలని కోర్టు కోరింది.