News February 12, 2025

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.

Similar News

News February 12, 2025

‘స్పిరిట్’: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కథను డైరెక్టర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈక్రమంలో కొత్త/ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులను తీసుకునేందుకు మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. దీంతో చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈలెక్కన అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

News February 12, 2025

ఈ ఏడాదే తల్లికి వందనం, బడ్జెట్‌లో నిధులు: సీఎం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పుపై మంత్రి పయ్యావుల, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమతూకంపైనా చర్చిస్తున్నారు.

News February 12, 2025

ఈ కార్లు కొనాలంటే నెలల తరబడి చూడాల్సిందే!

image

మహీంద్రా సంస్థకు కార్ల డెలివరీ చాలా ఆలస్యంగా ఇస్తుందన్న పేరుంది. ఆ సంస్థకు చెందిన థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ కార్ల డెలివరీ టైమ్ భారీగా ఉంటోంది. రాక్స్ బుక్ చేశాక దాని తాళాలు తొలిసారిగా చేతికి దక్కాలంటే 18 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇక స్కార్పియో-ఎన్‌కి 2 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలన్న డిమాండ్ కస్టమర్స్ నుంచి వ్యక్తమవుతోంది.

error: Content is protected !!