News June 4, 2024
మంగళగిరిలో లోకేశ్ ఆధిక్యం

గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News September 7, 2025
తెలుగు అబ్బాయికి రూ.5 కోట్ల ప్యాకేజీ!

AP: అనంతపురం (D) గుంతకల్లుకు చెందిన సాయి సాకేత్ అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించారు. తొలుత 10 వారాల పాటు ఇంటర్న్‌షిప్ కోసం రూ.కోటి ఆఫర్ చేసినట్లు అతడి పేరెంట్స్ రమేశ్, వాసవి తెలిపారు. అది పూర్తయ్యాక పెర్ఫార్మెన్స్ను బట్టి ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని చెప్పారు. వీరు పదేళ్ల క్రితం USకు వెళ్లి సెటిల్ అయ్యారు. సాకేత్ ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు.
News September 7, 2025
నవరో కామెంట్స్ ఫేక్: ‘X’ FACT CHECK

‘భారత్ తమ లాభాల కోసం రష్యా ఆయిల్ కొంటోంది’ అన్న US ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో వ్యాఖ్యలను ‘X’ ఖండించింది. ‘ఇంధన భద్రత కోసమే భారత్ రష్యా ఆయిల్ కొంటోంది. ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించట్లేదు. రష్యా నుంచి యురేనియం కొంటున్న US.. భారత్‌ని టార్గెట్ చేయడం ద్వంద్వ వైఖరే’ అని పేర్కొంది. దీంతో నవరో ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌పై మండిపడ్డారు. వారి ఫ్యాక్ట్ చెక్ ఓ చెత్త అని కొట్టి పారేశారు.
News September 7, 2025
ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో ఫ్రెంచ్ పెయిర్‌పై రిషభ్, ప్రతమేశ్, అమన్‌తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో విజయం సాధించింది. దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది.