News February 5, 2025
గూగుల్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ

AP:గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్తో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Similar News
News December 7, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 7, 2025
తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News December 7, 2025
ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్పై ఛార్జిషీట్

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.


