News October 24, 2024
ఎన్విడియా ఫౌండర్ జెన్సన్‌తో లోకేశ్ భేటీ

AP: ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో సూచనలు, మద్దతు ఇవ్వాల్సిందిగా జెన్సన్ను కోరినట్లు లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్‌లో ఏఐ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలిపారు. మళ్లీ ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానంటూ పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు : కలెక్టర్

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టంచేశారు. పెద్దంపేట సర్పంచ్ నామినేషన్ అంశంపై హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పర్యటించానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ కోర్టు విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.
News December 5, 2025
రాష్ట్రపతి భవన్‌కు పుతిన్.. ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించడం గమనార్హం.
News December 5, 2025
హోంలోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?


