News January 24, 2025
APలో HCLను విస్తరించాలని లోకేశ్ వినతి
APలో HCLను మరో 10వేల మందికి ఉపాధి కల్పించేలా విస్తరించాలని ఆ సంస్థ సీఈవో కళ్యాణ్‌కుమార్‌ను మంత్రి లోకేశ్ కోరారు. దావోస్ పర్యటనలో భాగంగా జరిగిన భేటీలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీల్లో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటించామని, ఏపీలో రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్మెంట్ ఇంపోర్టుకు 50శాతం రాయితీలు ఇస్తామన్నారు.
Similar News
News January 24, 2025
TDS రాజ్యాంగవిరుద్ధం: పిల్ తిరస్కరించిన CJI
TDSను నిరంకుశం, నిర్హేతుకం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలన్న పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘సారీ, మేం దీన్ని విచారించలేం. పిల్‌ను ఘోరంగా డ్రాఫ్ట్ చేశారు. మీరు హైకోర్టుకు వెళ్లొచ్చు. దీనిని మేం తిరస్కరిస్తున్నాం’ అని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. TDS సమానత్వ హక్కును హరించేస్తోందని, గుదిబండగా మారిందని BJP నేత, లాయర్ అశ్విని కుమార్ పిల్ దాఖలు చేశారు.
News January 24, 2025
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: నారాయణ
AP: అమరావతి అభివృద్ధి పనులను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నేలపాడులో అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను ఆయన పరిశీలించారు. ‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇస్తే 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరులోగా అన్నీ ఖరారు చేసి, మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం’ అని చెప్పారు.
News January 24, 2025
SHOCKING: అల్ట్రా HDలో ‘గేమ్ ఛేంజర్’ లీక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా అల్ట్రా HDలో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.