News December 16, 2024

టీడీపీ నేతలతో వైసీపీ నేత.. వివరణ కోరిన లోకేశ్

image

ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేశ్ పాల్గొనడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కొనకళ్ల నారాయణ సహా పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జోగి కూడా హాజరయ్యారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎవరు ఆహ్వానించారనే విషయాలపై లోకేశ్ వివరణ కోరారు.

Similar News

News December 18, 2025

రిటైర్మెంట్‌కు ముందు జడ్జిల సిక్సులు: సీజేఐ

image

రిటైర్మెంట్‌కు ముందు జడ్జిలు భారీగా ఆర్డర్స్ ఇచ్చే ధోరణి పెరుగుతోందని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పదవీవిరమణకు 10 రోజుల ముందు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి(MP) సస్పెండ్ అయ్యారు. 2 ఆర్డర్స్ విషయంలో ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో ఆ జడ్జి సుప్రీంను ఆశ్రయించారు. ‘పిటిషనర్(జడ్జి) పదవీ విరమణకు ముందు సిక్సర్లు కొట్టడం ప్రారంభించారు. ఇది దురదృష్టకరం. నేను దాని గురించి వివరించాలనుకోవట్లేదు’ అని CJI అన్నారు.

News December 18, 2025

పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కాకినాడలోని రంగ రాయ మెడికల్ కాలేజీలో 34 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు DEC 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, DCLT, BSc న్యూరో ఫిజియాలజీ, న్యూరో టెక్నాలజీ, BSc డయాలసిస్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, BSc ఇమేజింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్ పోస్టులకు టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. https://rmckakinada.com/

News December 18, 2025

311 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్వేలో 311 ఉద్యోగాల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, జూ.ట్రాన్స్‌లేటర్, స్టాఫ్&వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ తదితర ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, PG(హిందీ&ఇంగ్లిష్), డిగ్రీ పాసై, వయసు 18-40 ఏళ్లు ఉండాలి. DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
వెబ్‌సైట్: rrbcdg.gov.in/