News May 24, 2024
లోకేశ్‌కు పార్టీ బాధ్యతలు ఇవ్వాలి: బుద్దా వెంకన్న

AP: టీడీపీని కాపాడే శక్తి నారా లోకేశ్‌కు ఉందని, ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ కార్యక్రమమూ జరగాలన్నారు. ఇది తమ రిక్వెస్ట్ కాదని, డిమాండ్ అని చెప్పారు. ఇప్పటి వరకు సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడిని కేబినెట్లోకి తీసుకోవాలని కోరారు.
Similar News
News November 16, 2025
న్యూస్ అప్డేట్స్ @10AM

*ఛత్తీస్‌గఢ్ సుక్మా(D)లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
*తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
*ఈనెల 19 లేదా DEC 7న TGలో స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు ఉచిత చీరల పంపిణీ
*మరో ఆపరేషన్ సిందూర్ జరగకూడదని, IND-PAK రిలేషన్స్ మెరుగుపడాలని ఆశిస్తున్నానన్న J&K Ex CM ఫరూక్ అబ్దుల్లా
News November 16, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://sbi.bank.in/
News November 16, 2025
తమిళనాడు నుంచి ఏపీకి $150 మిలియన్ల పెట్టుబడులు

సౌత్ కొరియాకు చెందిన Hwaseung కంపెనీ ఏపీలో $150 మిలియన్ల పెట్టుబడులు పెట్టనుంది. కుప్పంలో నాన్-లెదర్ స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయనుంది. గ్లోబల్ బ్రాండ్లైన Nike, Adidasలను ఈ సంస్థే తయారు చేస్తుంది. కుప్పంలో ఏడాదికి 20 మిలియన్ల షూ జతలను ఉత్పత్తి చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఈ ఆగస్టులో తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నా తాజాగా ఏపీకి వస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.


