News January 27, 2025
నేడు కోర్టుకు లోకేశ్

AP: మంత్రి లోకేశ్ నేడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు వెళ్లనున్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ కోసం ఆయన స్వయంగా హాజరుకానున్నారు. 2019కి ముందు వైజాగ్ ఎయిర్పోర్టులో లోకేశ్ స్నాక్స్ కోసం ఖర్చయిందని సాక్షి కథనం ప్రచురించింది. ఇది తప్పుడు ప్రచారమని గతంలో ఖండించిన ఆయన, అసత్యాలతో పరువుకు భంగం కల్గించారంటూ రూ.75 కోట్లకు దావా వేశారు.
Similar News
News November 15, 2025
ఉండవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు

ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో కోళ్ల వ్యాన్ బోల్తా పడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా డ్రైవర్ హుస్సేన్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డివైడర్ను ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది. దీంతో హుస్సేన్తో పాటు క్లీనర్ మాలిక్కు స్వల్ప గాయాలు అయ్యాయి. బ్లూ కోట్ వీధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
News November 15, 2025
పార్టీ పరంగా 50% రిజర్వేషన్లకు ఖర్గే గ్రీన్ సిగ్నల్?

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, PCC చీఫ్ మహేశ్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు ఎల్లుండి జరిగే క్యాబినెట్లో రిజర్వేషన్లపై చర్చించనున్నారు.
News November 15, 2025
ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.


