News February 13, 2025
17న మహాకుంభ మేళాకు లోకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739402869378_782-normal-WIFI.webp)
AP: మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో కలిసి ఈ నెల 17న ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. అక్కడ వారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదే రోజు సాయంత్రం లోకేశ్ దంపతులు వారణాసి చేరుకొని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది.
Similar News
News February 13, 2025
మిగిలిన వారికి త్వరలో రైతు భరోసా: తుమ్మల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739414077167_653-normal-WIFI.webp)
TG: జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.
News February 13, 2025
‘అమ్మా.. నాన్నా.. క్షమించండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739417637370_653-normal-WIFI.webp)
రెండు రోజుల కింద విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని 12వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యూపీలోని గోరఖ్‌పూర్ హాస్టల్‌లో ఉంటున్న 18 ఏళ్ల అమ్మాయి హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు సంఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ, పాపా నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమించారు కానీ మీ ఆశలను నెరవేర్చలేపోయాను’ అని ఆమె అందులో రాసింది.
News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్ అందుకేనా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739416505886_782-normal-WIFI.webp)
AP: వల్లభనేని వంశీని HYDలో <<15446091>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో గన్నవరం TDP ఆఫీసుపై దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు. విచారణ జరుగుతుండగా ఇటీవల కేసు విత్ డ్రా చేసుకొని తనను బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్యవర్ధన్ విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.