News January 20, 2025

లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి?.. హోంమంత్రి ఏమన్నారంటే?

image

AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ప్రచారంపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘అంతా దైవేచ్ఛ. నుదుటిపై రాసి ఉన్నది ఎవరూ తీయలేరు. లోకేశ్‌కు రాసిపెట్టి ఉందేమో చూద్దాం’ అని అన్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలతో పాటు అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 3, 2025

భద్రాచలం- కొవ్వూరు రైల్వే‌లైన్ పూర్తి చేయాలి.!

image

భద్రాచలం- కొవ్వూరు రైల్వే‌లైన్ పనులను త్వరగా చేపట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌కు సంబంధించి వివరాలు తెలిపారు. పనులు వెంటనే మొదలుపెట్టే విధంగా రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఒక లేఖను కేంద్ర మంత్రికి అందించారు.

News December 3, 2025

రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం

image

ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. 359 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆ జట్టులో మార్క్రమ్ (110) టాప్ స్కోరర్. IND బౌలర్లలో అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీయగా, హర్షిత్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. SA విజయంతో 3 మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే ఈ నెల 6న వైజాగ్‌లో జరగనుంది.

News December 3, 2025

TG హైకోర్టు న్యూస్

image

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా