News January 5, 2025
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా లోకేశ్?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు సమాచారం. ఈవెంట్ ఏర్పాట్లు భారీ ఎత్తున చేపడుతున్నట్లు టాక్. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Similar News
News January 7, 2025
జత్వానీ కేసులో IPSలకు ముందస్తు బెయిల్
AP: ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట కలిగించింది. IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీ, ACP హనుమంతురావు, CI సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వారు తెలిపారు.
News January 7, 2025
దేశంలో మరో 2 hMPV కేసులు
hMP వైరస్ దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 7, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
News January 7, 2025
నయనతారకు నోటీసులు ఇవ్వలేదు: నిర్మాతలు
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని క్లిప్పింగ్స్ వాడుకున్నందుకు నయనతారకు తాము నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను నిర్మాతలు ఖండించారు. తాము రూ.5కోట్లు డిమాండ్ చేయలేదని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఆమె తమ నుంచి ముందే NOC తీసుకున్నారని తెలిపింది. కాగా ఈ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీదాన్’ క్లిప్స్ వాడినందుకు నయన్‌పై హీరో ధనుష్ రూ.10కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే.