News September 1, 2025

తండ్రికి లోకేశ్ ఎమోషనల్ విషెస్

image

చంద్రబాబు తొలిసారి CMగా బాధ్యతలు చేపట్టి 30ఏళ్లు పూర్తైన సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ’30 ఏళ్ల ప్రయాణం మైలురాయికి మించినది. హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు, బయోటెక్ ఆస్పిరేషన్స్ మొదలు డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు మీ కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని ఇంట్లో నాన్న అని, పని ప్రదేశంలో బాస్ అని పిలిచే అవకాశం దక్కడం నా అదృష్టం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 4, 2025

నెలాఖరు వరకు పొగాకు కొనుగోళ్లు: అచ్చెన్న

image

AP: సెప్టెంబర్ నెలాఖరులోగా నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. మార్క్‌ఫెడ్, ప్రైవేటు కంపెనీలు 55 మిలియన్ల కిలోలు కొన్నాయి. మిగిలిన పొగాకులో నెలాఖరులోగా 5 మి. కిలోలు మార్క్‌ఫెడ్, 20 మి. కిలోలు ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేయాలి. వచ్చే రబీలో ఎవరూ నల్ల బర్లీ పొగాకు పండించొద్దు’ అని సూచించారు.

News September 4, 2025

అప్పటివరకు పాత శ్లాబ్‌లోనే సిగరెట్, గుట్కా, బీడీ

image

కొత్తగా తీసుకొచ్చిన GST సంస్కరణలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అయితే SIN(హానికర) ట్యాక్స్ పరిధిలో ఉన్న సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, టొబాకో, జర్దా, బీడీలపై విధించిన 40% ట్యాక్స్‌ అమల్లోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. తదుపరి తేదీ ప్రకటించే వరకు ఇవి 28% శ్లాబ్‌లోనే కొనసాగనున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై సైజ్‌లను బట్టి GST, సెస్‌ కలిపి గరిష్ఠంగా 64% ట్యాక్స్ అమల్లో ఉంది.

News September 4, 2025

అన్ని కార్ల ధరలు తగ్గుతాయ్..

image

కొత్త జీఎస్టీ విధానంలో లగ్జరీ <<17606719>>కార్లను<<>> 40% శ్లాబులోకి (గతంలో 28%) తెచ్చారు. అయితే ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా అన్ని కార్ల ధరలు తగ్గుతాయని మీకు తెలుసా? ఎలా అంటే..
*ప్రస్తుతం 1200 cc (పెట్రోల్ ఇంజిన్) కంటే ఎక్కువ ఉన్న కార్లపై 28% జీఎస్టీతో పాటు 22% సెస్ వేస్తున్నారు. దీంతో పన్ను 50% పడుతోంది. కొత్త విధానంలో 40% జీఎస్టీలోకి తెచ్చారు. కానీ సెస్ పూర్తిగా తొలగించారు. దీంతో 10% పన్ను మిగిలినట్లే..