News September 2, 2025
వైఎస్ జగన్‌పై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు

AP: మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్‌ను కలవడానికి VIP పాస్‌లు’ అనే వార్తలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు.
Similar News
News September 2, 2025
టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్‌కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
News September 2, 2025
అఫ్గాన్ భూకంపం.. 1,400 మందికిపైగా మృతి

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన <<17587630>>భూకంప ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 3,124 మంది గాయపడ్డారని, 5,412 ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కునార్ ప్రావిన్సులోని ఆసదాబాద్, నుర్గల్, ఛౌకే, వాటాపూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
News September 2, 2025
రేపు కవిత ప్రెస్‌మీట్

TG: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత రేపు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.