News October 19, 2025
ఈ నెల 24వరకు ఆస్ట్రేలియాలో లోకేశ్ పర్యటన

AP: మంత్రి నారా లోకేశ్ నేటి నుంచి ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశ హైకమిషనర్ ఆహ్వానం మేరకు ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం’లో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. వచ్చే నెల 14, 15న జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేసేందుకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. ఇవాళ స్థానిక కాలమానం ప్రకారం 11.30amకు చేరుకొని, సాయంత్రం సిడ్నీలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు.
Similar News
News October 19, 2025
గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే?

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు గర్భనిరోధక టాబ్లెట్ తీసుకుంటే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో 5 రోజుల్లోపు తీసుకోవచ్చంటున్నారు. అయితే దీన్ని అబార్షన్ ప్రేరేపితంగా ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ మాత్ర వల్ల మైగ్రేన్, అలసట, వాంతులు, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు.
* ఉమెన్ రిలేటెడ్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 19, 2025
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ 5 హిందీ ట్రాన్స్‌లేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డిగ్రీ (హిందీ, ఇంగ్లిష్ ఎలక్టివ్ సబ్జెక్ట్ కలిగినవారు) ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/
News October 19, 2025
హర్షిత్ రాణాపై తీవ్ర ఒత్తిడి!

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుండగా, తుది జట్టులో స్థానం దక్కితే హర్షిత్ రాణాపై తీవ్ర ఒత్తిడి ఉండే ఛాన్స్ ఉంది. కోచ్ గంభీర్‌కు క్లోజ్ అవడం వల్లే రాణా జట్టులో ఉన్నారని, AUS సిరీస్‌కు ఎందుకు సెలక్ట్ చేశారో అర్థం కాలేదని పలువురు మాజీలు ఇప్పటికే పెదవి విరిచారు. దీనిపై <<18002234>>గంభీర్<<>> కూడా ఘాటుగానే స్పందించారు. ఈ క్రమంలో ప్లేయింగ్ 11కి ఎంపికైతే రాణా ఏ మేరకు రాణిస్తారో చూడాలి. దీనిపై మీ COMMENT.