News July 30, 2024

లోకుర్.. ఎవరికీ తలొగ్గరు!

image

TG: విద్యుత్ కమిషన్ నూతన <<13738543>>ఛైర్మన్<<>> జస్టిస్ మదన్ బి లోకుర్‌ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారనే పేరుంది. ప్రభుత్వాలు చేసే అన్యాయాలను ఎండగడుతుంటారట. న్యాయవ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని, ఇది దేశానికి మంచిది కాదని గతంలో విమర్శలు చేశారు. దర్యాప్తుసంస్థలు రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేసి ఆధారాలు సమర్పించకుండా జైల్లోనే ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాయని, కోర్టులు పసిగట్టట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Similar News

News November 13, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.in‌లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.

News November 13, 2025

కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

image

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.

News November 13, 2025

శివుడికి మూడో నేత్రం నిజంగానే ఉంటుందా?

image

శివుడికి మూడో నేత్రం ఉంటుంది. కానీ, చిత్రపటాల్లో చూపించినట్లు అది భౌతికమైనది కాదు. ఆ నేత్రం జ్ఞానానికి, అంతర దృష్టికి సంకేతం. దాని ద్వారానే ఆయన లోకాలను నడిపిస్తున్నాడు. ఆయన అంతటి జ్ఞానవంతుడని తెలిపేందుకే విగ్రహాలు, ఫొటోల్లో ఆ నేత్రాన్ని చూపిస్తారు. జ్ఞానం అనే ఈ మూడో కన్ను మనక్కూడా ఉంటుందని, దాని ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్షం వైపు అడుగులేస్తారని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#SIVA<<>>