News April 4, 2025
‘వక్ఫ్’ తరహాలోనే పార్లమెంటులో సుదీర్ఘ చర్చలివే!

వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలు, రాజ్యసభలో 17 గంటల పాటు చర్చ జరిగింది. ఇదొక అరుదైన విషయమని RS ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. అయితే గతంలోనూ పార్లమెంటులో మారథాన్ చర్చలు జరిగాయి. LSలో స్టేట్ ఆఫ్ అవర్ డెమొక్రసీపై 20.8గంటలు, రైల్వే బడ్జెట్‌పై 1993లో 18.35గంటలు, 1988లో 19.04గంటలు, మైనార్టీల భద్రత బిల్లుపై 17.25గంటలు, 1981లో RSలో ఎసెన్షియల్ సర్వీసెస్ బిల్లుపై 16.88గంటల చర్చ జరిగింది.
Similar News
News April 12, 2025
మార్క్ శంకర్‌కు బ్రోన్కో స్కోపీ.. ఖర్చు ఎంతంటే?

సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌కు <<16039701>>బ్రోన్కో స్కోపీ<<>> చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు. దీనికి రూ.5 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరోవైపు చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో బిల్లు లక్షల్లో ఉంటుందని చర్చ జరిగినా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ పూర్తైందని తెలుస్తోంది.
News April 12, 2025
దేశంలో ఉగ్రదాడులు.. నిఘా వర్గాల WARNING

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు తీసుకురాగా నిఘావర్గాలు హెచ్చరికలు చేశాయి. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయవచ్చని తెలిపాయి. ఐఈడీ, డ్రోన్ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి. నదీమార్గాల్లోనూ తీవ్రవాదులు చొరబడవచ్చని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి.
News April 12, 2025
సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఒకవేళ గడువు దాటితే అందుకు గల కారణాలను గవర్నర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్ద పెండింగ్‌లో ఉంచడంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు బిల్లుల పరిశీలనకు రాష్ట్రపతికి గడువు అనేది లేదు.