News March 23, 2024

ఆ అమైనో యాసిడ్ తగ్గిస్తే దీర్ఘాయువు!

image

మన శరీరంలోని 20 రకాల అమైనో యాసిడ్స్‌లో ఒకటైన ఐసోలియూసిన్ వినియోగం తగ్గిస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరదని పరిశోధకులు కనుగొన్నారు. తమ పరిశోధనలో ఎలుకల ఆయుష్షు 33% పెరిగిందని తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన 26 అంశాల్లో ఇవి వృద్ధి సాధించాయట. మనుషులకు ఇది వర్తించొచ్చని దీనిపై సమగ్ర పరిశోధన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఐసోలియూసిన్ గుడ్లు, మాంసం, డైరీ ఉత్పత్తులు మొదలైన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.

Similar News

News December 8, 2025

INDIGO… NAIDU MUST GO: అంబటి

image

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

News December 8, 2025

‘నీ భార్యను ఇండియాకు పంపేయ్’.. JD వాన్స్‌పై నెటిజన్ల ఫైర్

image

వలసలపై US ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సామూహిక వలసలు అమెరికా కలను దొంగతనం చేయడమేనని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది విదేశీయులపై ద్వేషమేనని నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘మీ భార్య ఉష, ఆమె ఫ్యామిలీ, మీ పిల్లలను ఇండియాకు పంపేయండి’ అని మండిపడుతున్నారు. హిందువైన తన భార్య <<18155411>>క్రైస్తవం<<>>లోకి మారే ఛాన్స్ ఉందని ఇటీవల వాన్స్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి.

News December 8, 2025

NCDCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NCDC<<>>) 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA-ఇంటర్మీడియట్, ICWA-ఇంటర్మీడియట్, M.com ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం రూ.25,000-రూ.40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncdc.in