News August 16, 2024
ఇండియాలో పొడవైన జాతీయ రహదారులు

*NH-44: శ్రీనగర్ – కన్యాకుమారి 3745 KM
*NH-27: పోర్బందర్ – సిల్చార్ (అస్సాం) 3507 KM
*NH-48 ఢిల్లీ – చెన్నై 2807 KM
*NH52: సంగ్రూర్ (పంజాబ్)- అంకోలా (కర్ణాటక) 2317 KM
*NH30: సితార్‌గంజ్ (UK) – ఇబ్రహీంపట్నం (ఏపీ) 1984 KM
*NH6: హజిరా (గుజరాత్) – కోల్‌కతా 1949
*NH16: కోల్‌కతా – చెన్నై 1711 KM
*NH19: ఆగ్రా (యూపీ) – డంకుని (బెంగాల్) 1435 KM
*NH7: వారణాసి – కన్యాకుమారి 1296 KM
Similar News
News January 4, 2026
చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
News January 4, 2026
విడాకులు ప్రకటించిన సెలబ్రిటీ కపుల్

జై భానుశాలి-మాహీ విజు దంపతులు విడాకులు ప్రకటించారు. 2011లో పెళ్లి చేసుకున్న వీరు వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా జై హిందీలో అనేక సీరియల్స్‌లో నటించి, డాన్స్ ఇండియా డాన్స్, సరిగమప, సూపర్ స్టార్ సింగర్ తదితర షోలు హోస్ట్ చేశారు. BB 12, 13లలో పాల్గొన్నారు. ఇక BB13కూ వెళ్లిన మాహీ ‘తపన’ మూవీ, ‘చిన్నారి పెళ్లికూతురు, వసంత కోకిల’ తదితర ఒరిజినల్ వెర్షన్ సీరియల్స్‌లో నటించారు.
News January 4, 2026
భోగాపురం.. మైలురాయితో కొత్త రెక్కలు: CBN

AP: భోగాపురంలో వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతం కావడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విమానయాన ప్రయాణం ఇవాళ మరో మైలురాయికి చేరిందని ట్వీట్ చేశారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర వృద్ధికి కొత్త రెక్కలని అభివర్ణించారు. అటు AP అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా బాబు ధన్యవాదాలు తెలిపారు.


