News April 14, 2024
ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్

కోల్‌కతాతో డెబ్యూ మ్యాచ్‌లో లక్నో బౌలర్ షమర్ జోసెఫ్ ఘోరంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నారు. మూడు క్యాచ్‌లు సైతం వదిలేశారు. తొలి ఓవర్‌లో పది బాల్స్ వేసి (0, L1, 4, 2, b1, nb, Wd, Wd4, nb, 6) ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మొత్తం 7 వైడ్‌లు, 3 నో బాల్స్ వేశారు. అతని వల్లే మ్యాచ్ చేజారిపోయిందని లక్నో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Similar News
News March 12, 2026
వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

TG: వాట్సాప్ ద్వారా పలు రకాల వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఓపీ రిజిస్ట్రేషన్, హెల్త్ కార్డుల డౌన్‌లోడ్ వంటి సేవలను అందించనుంది. ప్రభుత్వ తేనున్న ప్రత్యేక నంబర్‌కు HI అని మెసేజ్ చేసి, ఆయుష్మాన్ భారత్ ID, ఆధార్‌తో వెరిఫై చేసుకోవాలి. ఆస్పత్రిని సెలక్ట్ చేసుకుని సేవలు పొందవచ్చు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఫిర్యాదులూ చేయవచ్చు. తొలుత 1000 ఆస్పత్రులలో అందుబాటులోకి తేనున్నారు.
News March 12, 2026
23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.
News March 12, 2026
ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.


