News March 6, 2025
వీర్యం నాణ్యతగా ఉంటే దీర్ఘాయుష్షు?

నాణ్యమైన వీర్యం ఉన్న వ్యక్తులు ఇతరుల కంటే రెండు మూడేళ్లు ఎక్కువగా బతుకుతారని డెన్మార్క్లోని కోపెన్ హెగెన్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. వీరు 50 ఏళ్లుగా 80 వేల మంది పురుషులపై స్టడీ చేశారు. శుక్ర కణాల సంఖ్య 120 మిలియన్లకుపైగా ఉన్నవారు 5 మిలియన్లు ఉన్న వారి కంటే 2.7 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారని తెలిపింది. స్పెర్మ్ క్వాలిటీ ఉండేవారు 80.3, తక్కువగా ఉండేవారు 77.7 ఏళ్లు జీవిస్తారని పేర్కొంది.
Similar News
News September 18, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
News September 18, 2025
అర్ధరాత్రి 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

TG: భారీ వర్షం హైదరాబాద్ మహా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అర్ధరాత్రైనా చాలామంది ఇళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. బేగంపేట-సికింద్రాబాద్ రూట్లో 5 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News September 18, 2025
సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం