News July 3, 2024

రికార్డ్స్ చూసుకోండి.. బుమ్రా బౌలింగ్ ఫెయిల్ అయింది లేదు!

image

యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 13 మ్యాచుల్లో 42 వికెట్లు పడగొట్టారు. దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఆయన తర్వాత జాష్ హేజిల్‌వుడ్ 16 మ్యాచుల్లో 39, హసరంగా 16 మ్యాచుల్లో 36, షాహీన్ అఫ్రీది 18 మ్యాచుల్లో 32, మార్క్ అడైర్ 15 మ్యాచుల్లో 31 వికెట్లు తీశారు. కాగా T20 WC-2024లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు.

Similar News

News March 11, 2026

ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.

News March 11, 2026

OTTలోకి 4 కొత్త సినిమాలు

image

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.

News March 11, 2026

భారత్‌కు తొలి టెస్ట్ విజయం అందించింది ఈయనే

image

భారత్‌కు తొలి టెస్ట్ విజయాన్ని(1952లో ENGపై) అందించిన కెప్టెన్ విజయ్ హజారే జన్మదినం నేడు. 1915లో సాంగ్లీ(MH)లో జన్మించారు. IND తరఫున 30 టెస్టుల్లో 2192 రన్స్, 20W తీశారు. 14 టెస్టులకు కెప్టెన్సీ చేశారు. FCలో 238 మ్యాచుల్లో 18,740R, 595W సాధించారు. FCలో 2 ట్రిపుల్ సెంచరీలు, ఒకే టెస్టులో 2 సెంచరీలు చేసిన తొలి IND ప్లేయర్ ఆయనే. కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పేరిట టోర్నీ నిర్వహిస్తోంది.