News January 22, 2025
సమంత ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా తెలుగు సినిమాల్లో నటించట్లేదు. హిందీలోనూ అదే పరిస్థితి. ఇటు మీడియాకూ ఆమె దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె WPBL చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలను ఇన్స్టాలో పంచుకున్నారు. ఇటీవల ఆమె చికున్ గున్యా నుంచి కోలుకున్నారు. ఆమె చాలా సన్నపడ్డారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News January 22, 2025
BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.
News January 22, 2025
నోటిఫికేషన్ వచ్చేసింది..
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <
News January 22, 2025
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.