News November 26, 2024
అనారోగ్యంపై గూగుల్‌లో చూడటమూ రోగమే!
అరచేతిలో నెట్ ఉండటంతో స్వల్ప అస్వస్థత కలిగినా గూగుల్‌ని అడగడం చాలామందికి పరిపాటిగా మారింది. అలా చూడటం కూడా సైబర్‌కాండ్రియా అనే మానసిక రుగ్మతేనంటున్నారు వైద్యులు. ఓ అధ్యయనం ప్రకారం ఇంటర్నెట్ వాడేవారిలో 72శాతం మంది తమ ఆరోగ్య సమస్యలపై గూగుల్ చేస్తున్నారట. దీని వల్ల అపోహలతో ఆందోళనకు లోనయ్యే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య ఉంటే వైద్యులకు చూపించుకోవడం సరైనదని సూచిస్తున్నారు.
Similar News
News November 26, 2024
పుష్ప-2 షూటింగ్ పూర్తి.. అల్లు అర్జున్ పోస్ట్
పుష్ప-2 షూటింగ్ పూర్తైనట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. పుష్ప లాస్ట్ డే షూట్ అంటూ బన్నీ ఓ ఫొటోను పంచుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన సీన్ షూటింగ్ ఇవాళ జరిగినట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. ‘పుష్ప యూనిట్‌తో ఐదేళ్ల ప్రయాణం ముగిసింది. అద్భుతమైన ప్రయాణం’ అంటూ లవ్ సింబల్‌ను ఆయన పోస్ట్ చేశారు. కాగా డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.
News November 26, 2024
29న ఛాంపియన్స్ ట్రోఫీపై ఫైనల్ డెసిషన్?
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఈ నెల 29న ICC తుది నిర్ణయం వెలువరించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్, భారత్ పర్యటన, హైబ్రిడ్ మోడల్ వంటి విషయాలపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని సమాచారం. కాగా హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచుతామని ICC ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచులను UAEలో నిర్వహించాలని, ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరపాలని పాక్‌ను కోరినట్లు సమాచారం.
News November 26, 2024
BIG ALERT.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం రేపటికి తుఫానుగా బలపడుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఎల్లుండి కాకినాడ, కోనసీమ, కృష్ణా, NLR, YSR, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, TPTY జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది.