News June 13, 2024

మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నా: మమతా మోహన్‌దాస్

image

జీవితంలో కచ్చితంగా ఒక తోడు ఉండాలని భావించడం లేదని నటి మమతా మోహన్ దాస్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘లాస్ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ మా బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రిలేషన్ ఉండాలి కానీ అందులో ప్రెజర్ ఉండకూడదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం మంచి భాగస్వామి కోసం వెతుకుతున్నా. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకొస్తాయి’ అని చెప్పారు.

Similar News

News September 12, 2025

ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

image

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.

News September 12, 2025

ఎంటర్‌పెన్యూర్‌షిప్‌తోనే రాష్ట్రాభివృద్ధి: వ్యాపారవేత్తలు

image

AP: వ్యాపార రంగం వచ్చే పదేళ్లలో ఎలాంటి పురోగతిని చూడబోతోంది అనే అంశంపై Way2News Conclaveలో తెనాలి డబుల్ హార్స్ MD శ్యాంప్రసాద్, సోనోవిజన్ MD భాస్కర్ మూర్తి, GVమాల్ MD ఉమామహేశ్వర్, విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ రత్తయ్య తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్యోగాలు కాకుండా సొంత వ్యాపారంతోనే వ్యక్తిగత, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు సూచించారు. ఎవరైనా టెక్నాలజీని వ్యాపారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

News September 12, 2025

దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. కారణమిదే!

image

UP బరేలీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఇది తమ పనేనంటూ రోహిత్ గొడారా& గోల్డీ బ్రార్ గ్యాంగ్ SMలో పోస్ట్ చేసింది. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహరాజ్‌ను అగౌరవపరిచినందుకే కాల్పులు జరిపామంది. ఇది ట్రైలర్ మాత్రమేనని, సాధువులు, సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎవర్నీ వదలబోమని హెచ్చరించింది. కాగా ఇటీవల అనిరుద్ధాచార్యపై దిశా సోదరి కుష్బూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.