News November 17, 2024
కోహ్లీని ఔట్ చేయడానికి ఎదురుచూస్తున్నా: మార్ష్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తెలిపారు. అతడి వల్ల ఎంత ముప్పు ఉందో తమకు తెలుసని పేర్కొన్నారు. ‘కోహ్లీతో కలిసి IPLలో ఆడాను కాబట్టి మైదానం వెలుపల ఎలా ఉంటారో నాకు తెలుసు. అతడ్ని రెచ్చగొట్టాలని మునుపెన్నడూ యత్నించలేదు. ఈసారి కూడా నా బౌలింగే మాట్లాడుతుంది. విరాట్ 30ల్లో ఉండగానే ఔట్ చేస్తా’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 17, 2024
అప్పట్లో గొరిల్లాతో పోటీకి సిద్ధమైన మైక్ టైసన్
అప్పట్లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధపడ్డారు. 1980ల్లోన్యూయార్క్లోని ఓ జూకు అప్పటి తన భార్య రాబిన్ గివెన్స్‌తో కలిసి ఆయన సందర్శనకు వెళ్లారు. ఆ జూలో ఓ గొరిల్లా ఇతర గొరిల్లాలను కొట్టడాన్ని ఆయన చూశారు. దీంతో దాని అంతు చూసేందుకు టైసన్ సిద్ధమై జూ కీపర్‌తో చర్చించారు. 10,000 డాలర్లు ఇస్తా, తనను గొరిల్లాతో ఫైట్‌కు అనుమతించాలని కోరారు. కానీ దీనికి ఆ జూ కీపర్ అంగీకరించలేదు.
News November 17, 2024
‘పుష్ప-2’ ట్రైలర్ మ్యూజిక్ మిక్స్‌పై ఆస్కార్ విన్నర్ ట్వీట్
మరికొన్ని గంటల్లో ‘పుష్ప-2’ ట్రైలర్ విడుదలవనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీత, సౌండ్ డిజైనర్ రెసుల్ పూకుట్టి థియేటర్ యజమానులకు ఓ సూచన చేశారు. ‘పుష్ప-2 ట్రైలర్ ఇవాళ విడుదలవనుంది. అంతా చాలా హడావుడిగా ఉంది. స్టాండర్డ్ డాల్బీ లెవల్ 7లో సౌండ్ మిక్స్ చేశామని సినీ ప్రేమికులకు చెప్తున్నా. కాబట్టి యాంప్లిఫయర్లను సరైన సమయంలో ట్యూన్ అప్ చేయాలని థియేటర్లకు సూచిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News November 17, 2024
మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ శివసేన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు చెప్పకపోవడంపై నిరాశ చెందినట్టు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయాన్ని వెల్లడించకుండా చంద్రచూడ్ కేవలం కామెంటేటర్‌గా మిగిలిపోయారని దుయ్యబట్టారు. జడ్జిగా కాకుండా న్యాయ విద్య లెక్చరర్‌గా చంద్రచూడ్ పని చేసి వుంటే మరింత పేరు సంపాదించేవారని వ్యంగ్యంగా విమర్శించారు.