News September 10, 2025

మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్

image

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ‘వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ట్రేడ్ విషయంలో రెండు గొప్ప దేశాలు సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News February 1, 2026

‘సింగరేణి’ పై కమిటీ నివేదిక అందింది: కిషన్ రెడ్డి

image

TG: సింగరేణి కాలరీస్ కంపెనీ వ్యవహారాలపై అధికారుల కమిటీ నివేదిక అందిందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో ఎక్కువ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹51000 CR సంస్థకు బకాయి పడిందని చెప్పారు. కాగా నైనీ బొగ్గు గనుల టెండర్లు, CSR నిధులపై వివాదం నెలకొనడం తెలిసిందే.

News February 1, 2026

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 252 రన్స్ చేయగా, పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే, ఖిలాన్ చెరో 3 వికెట్లు, అంబరీశ్, హెనిల్, చౌహాన్, విహాన్ తలో వికెట్ చేశారు. ఈ గెలుపుతో ఆయుశ్ సేన జైత్ర యాత్రను కొనసాగిస్తూ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

News February 1, 2026

పార్టీ ఫండ్ నుంచి ఆ పరికరాలు కొన్నారా: KCRను ప్రశ్నించిన సిట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ పలు ప్రశ్నలు వేస్తూ KCRను విచారించినట్లు సమాచారం. ‘ప్రభాకర్ రావు సర్వీసును ఎందుకు పొడిగించారు? ఆయనకే 2 పోస్టులెందుకు ఇచ్చారు? ట్యాపింగ్ పరికరాలకు పార్టీ నిధులు వాడారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. BRSకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయంటూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన ముందు పెట్టినట్లు తెలుస్తోంది.