News September 5, 2025

శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి నుంచి రూ.60కోట్లు తీసుకొని మోసం చేశారన్న అభియోగాలపై వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీరి ట్రావెల్ లాగ్‌లను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో దంపతులు దేశం వదిలి వెళ్లకుండా నోటీసులిచ్చారు.

Similar News

News September 7, 2025

క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రెండు కమిటీలు

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తోంది.

News September 7, 2025

సౌతాఫ్రికా ఘోర ఓటమి

image

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో SA ఘోర పరాజయం పాలైంది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ బ్యాటర్లు 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) అంటేనే వాళ్ల ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా టాపార్డర్‌ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో SA ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం.

News September 7, 2025

రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.