News November 18, 2024

లగచర్ల ఘటనలో A2పై లుకౌట్ నోటీసులు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న A2 సురేశ్ కోసం గాలిస్తున్నారు. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News November 26, 2025

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్ రావ‌డానికి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాల‌ని, వ్యాయామం చేయాల‌ని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.

News November 26, 2025

బెండ, టమాటా, వంగలో వైరస్ తెగుళ్ల నివారణ

image

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.

News November 26, 2025

భారత్ చెత్త రికార్డు

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్‌లో రన్స్ పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్‌లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.