News August 4, 2024
వల్లభనేని వంశీపై లుక్ అవుట్ నోటీసులు?

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల క్రితమే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వంశీని పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు హల్ చల్ చేయగా వాటిల్లో నిజం లేదని వంశీ సన్నిహితులు చెబుతున్నారు. నోటీసులు జారీ చేసే లోపే ఆయన విదేశాలకు వెళ్లిపోయారని సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News January 23, 2026
గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
News January 23, 2026
వంట గది ఏ వైపున ఉండాలి?

వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల సరిపడా గాలి, వెలుతురు వచ్చి ఇల్లాలు అలసట లేకుండా వంట చేయగలదని చెబుతున్నారు. ‘వంటగదిలో పూజ గది ఉండటం శ్రేయస్కరం కాదు. శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగుళ్లు ఇచ్చిన గాజు, పింగాణీ పాత్రలను ఉంచకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వంట రుచికరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 23, 2026
అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ పిలుస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. విచారణ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతోందన్నారు. కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించామని, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్లు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని కేటీఆర్‌కు చెప్పామన్నారు. కాగా ఇవాళ కేటీఆర్‌ను సిట్ 7 గంటలకు పైగా ప్రశ్నించింది.


