News March 5, 2025
LoP: నిబంధనలు ఏం చెబుతున్నాయి?

చట్టసభలో <<15658824>>ప్రతిపక్ష<<>> హోదా దక్కాలంటే ఆ పార్టీకి 10% సీట్లు రావాలని LoP 1977సం. చట్టం చెబుతోంది. 10% సీట్లు వచ్చి అధికారపక్షం తర్వాత అత్యధిక స్థానాలు గల పార్టీకి ఇది దక్కుతుంది. అధికార పక్షం తర్వాత ఒకటి కంటే ఎక్కువ పార్టీలు సమాన స్థానాలు పొందితే ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయం ప్రకారం ఒక పార్టీకి ఈ గుర్తింపు ఇస్తారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై TDP,YCP మధ్య ప్రస్తుతం ఇదే రగడ జరుగుతోంది.
PS: YCP-11/175
Similar News
News December 3, 2025
రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
News December 3, 2025
ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <


