News July 8, 2025
శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.
Similar News
News July 8, 2025
జగన్ కారులో కూర్చున్నందుకు నాపై కేసు: పేర్ని నాని

AP: ఇటీవల మాజీ CM జగన్ కారులో వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించినందుకు కూటమి సర్కార్ తనపై కేసు పెట్టిందని YCP నేత పేర్ని నాని మండిపడ్డారు. మరి గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారకుడైన చంద్రబాబుపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు 2029లో దీటుగా సమాధానం చెబుతాం. చెడు సంప్రదాయాలకు తెర తీస్తే పాపం అనుభవించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు.
News July 8, 2025
లక్ అంటే ఇతడిదే..

బిట్‌కాయిన్ విలువ కొన్నేళ్లలోనే లక్షల రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇది ఓ వ్యక్తిని బిలియనీర్‌ను చేసిన ఘటనపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఓ వ్యక్తి 14 ఏళ్ల క్రితం APR 3, 2011న బిట్‌కాయిన్ ప్రారంభంలో $7,800 విలువైన టోకెన్లను కొన్నారు. ప్రస్తుతం ఈ టోకెన్ల విలువ 140,000 రెట్లు పెరిగింది. దీంతో ఆయనకు చెందిన 10,000 బిట్‌కాయిన్లను విక్రయించగా అతనికి $1.09 బిలియన్లు (సుమారు ₹9,300కోట్లు) లభించాయి.
News July 8, 2025
ఎన్టీఆర్‌తో నటించడం గౌరవంగా ఉంది: హృతిక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం తనకు గౌరవంగా ఉందని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అన్నారు. ‘వార్ 2’ షూట్ ప్యాకప్ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘149 రోజుల జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కియారా అద్వానీతో నటించడం మరిచిపోలేను. ఈ సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. ఆగస్టు 14న మళ్లీ కలుద్దాం’ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా నిన్న హృతిక్‌పై <<16982214>>తారక్ ప్రశంసలు<<>> కురిపించిన విషయం తెలిసిందే.