News January 13, 2025

లాస్ ఏంజెలిస్ కార్చిచ్చు.. హాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

image

లాస్ ఏంజెలిస్‌లో చెల‌రేగిన కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో ఏర్పడిన నీటి కొర‌తకు హాలీవుడ్ న‌టులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విస్తార‌మైన వారి ఇంటి గార్డెన్ల నిర్వ‌హ‌ణ‌కు మోతాదుకు మించి నీటిని వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. గ‌తంలో ప‌రిమితికి మించి నీటిని వినియోగించార‌ని కిమ్ క‌ర్దాషియ‌న్‌కు ఫైన్ విధించారు. సిల్వ‌స్టెర్ స్టాలోన్‌, కెవిన్ హార్ట్ వంటి ప్ర‌ముఖులూ ఫైన్ చెల్లించిన వారిలో ఉన్నారు.

Similar News

News November 22, 2025

PHOTO GALLERY: భారతీయ కళా మహోత్సవం

image

HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్‌ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. నేటి ప్రదర్శనల ఫొటోలు పైన చూడవచ్చు.

News November 22, 2025

SRHలోనే విధ్వంసకర బ్యాటర్లు

image

మినీ వేలం వేళ హిట్టర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌ను SRH విడిచిపెట్టనుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ యాజమాన్యం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. తాజాగా ఈ విధ్వంసకర వీరులిద్దరి ఫొటోలను SRH ట్వీట్ చేసింది. టాప్ ఆర్డర్‌లో హెడ్, మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్‌ ‘ఫైర్ పవర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ వీరిద్దరూ ఊచకోత కోయాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 22, 2025

త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

image

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.