News January 11, 2025
శ్మశానంలా లాస్ ఏంజెలెస్.. కానీ ఒకే ఒక ఇల్లు..!

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని కార్చిచ్చు సర్వనాశనం చేసింది. వైల్డ్‌ఫైర్ కారణంగా ఎటుచూసినా శ్మశానాన్ని తలపిస్తోంది. మంటలంటుకున్న అన్ని ఇళ్లూ అగ్నికి ఆహుతయ్యాయి. కానీ ఒకే ఒక ఇల్లు మాత్రం ఫైర్‌కు ప్రభావం కాలేదు. నగరంలో ‘మాలిబు మాన్షన్’ ఈ అగ్ని కీలల నుంచి తప్పించుకుంది. ఈ భవనాన్ని ఫైర్ ప్రూఫ్‌గా నిర్మించడంతోనే ఇది మంటలకు దగ్ధం కాలేదు. అలాగే భూకంపం వచ్చినా తట్టుకునేలా దీనిని నిర్మించారు.
Similar News
News January 24, 2026
ఉద్యోగులకు షాక్.. డుమ్మా కొడితే ఇంటికే!

TG: డ్యూటీకి రెగ్యులర్‌గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఏడాదికి మించి విధులకు దూరంగా ఉంటే నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్’ను మారుస్తూ CS ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా ఐదేళ్లు సెలవులో ఉన్నా, అనుమతి లేని ఫారిన్ సర్వీసులో కొనసాగినా వేటు తప్పదు. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు.
News January 24, 2026
కాఫీ పొడితో కళకళలాడే ముఖం

కాఫీ తాగడం వల్ల ఆరోగ్యప్రయోజనాలతో పాటు చర్మం కూడా మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు. కాఫీ పొడి ఫేస్ ప్యాక్‌లు వాడటం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని హెయిర్, స్కిన్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News January 24, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ 24 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://mumbaiport.gov.in


