News January 27, 2025
ఊపిరి పీల్చుకున్న లాస్ ఏంజెలిస్

కార్చిచ్చుతో ఉక్కిరి బిక్కిరి అయిన లాస్ ఏంజెలిస్ తొలకరి వర్షాలతో ఊపిరి పీల్చుకుంది. ఈ సీజన్‌లో అక్కడ తొలికరి జల్లు కురిసింది. మరో మూడు రోజులపాటు కూడా అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ విభాగం తెలిపింది. ఈ వర్షాలతో కొత్త మంటలు చెలరేగకుండా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ వానలతో కాలిపోయిన కొండ ప్రాంతాల నుంచి బూడిద ప్రవాహం కొట్టుకువస్తుందనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.
Similar News
News February 7, 2026
సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చెయ్యొచ్చా?

మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే, రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదని చాలామంది భావిస్తారు. అయితే సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయొచ్చంటున్నారు నిపుణులు. కానీ మొదటి డెలివరీ ఎలా జరిగింది, ఎలాంటి కాంప్లికేషన్లు వచ్చాయి, బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యం, రెండు డెలివరీలకు మధ్య గ్యాప్‌పై ఆధారపడి ఉంటుంది. రెండో డెలివరీ నార్మల్ అవ్వాలంటే ముందుగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
News February 7, 2026
ఎల్లుండి ఢిల్లీకి సీఎం.. సర్వత్రా ఉత్కంఠ

AP: ఈ నెల 9న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పర్యటనలో కేంద్రప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
News February 7, 2026
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 40 పోస్టులకు నోటిఫికేషన్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 40 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 10 వరకు పోస్ట్ చేయాలి. సంబంధిత విభాగంలో PhD/M.Phil, పీజీ, ME/MTech, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in


