News January 9, 2025
అంతరిక్షం నుంచి లాస్ ఏంజెలిస్ వైల్డ్ ఫైర్ PHOTO
అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో కార్చిచ్చు వేలాది ఎకరాలను దహించివేస్తోంది. దావానలంలా వ్యాపిస్తున్న మంటల్లో గ్రామాలన్నీ బూడిదవుతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్, పొగ ఏకంగా అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ESA ప్రయోగించిన కోపర్నికస్ సెంటినెల్-2 శాటిలైట్ ఈ అగ్నికీలల ఫొటో తీసింది.
Similar News
News January 10, 2025
తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
AP: తిరుమలలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి పూజలు, హారతి, పుష్ప సమర్పణ చేశారు. తె.4.30 నుంచి ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 10రోజులు శ్రీవారు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వనున్నారు. అటు శ్రీశైలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెలుపలికి తీసుకొచ్చి రావణ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి వేళ పుష్పార్చన నిర్వహించనున్నారు.
News January 10, 2025
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. 18న కీలక తీర్పు
సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని సంజయ్కు మరణశిక్ష విధించాలని CBI కోరింది. అటు కేసులో సాక్ష్యాలను క్రియేట్ చేసి తన క్లయింట్ను ఇరికించారని నిందితుడి లాయర్ వాదించారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
News January 10, 2025
మోదీజీ.. ఇగో పక్కనపెట్టి రైతులతో చర్చించండి: ప్రియాంక
ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. రైతుల పట్ల కేంద్రం క్రూరంగా ప్రవర్తిస్తోందని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ప్రధాని మోదీ తన ఇగోను పక్కనపెట్టి అన్నదాతలతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మొండి వైఖరే గతంలో 700 మంది రైతులను పొట్టనబెట్టుకుందని ప్రియాంక ఆరోపించారు.