News April 12, 2024

MLAగా ఓడి MPగా బరిలోకి..

image

TG: కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఆరూరి రమేశ్, రఘునందన్ రావు, నీలం మధు, RS ప్రవీణ్ కుమార్ వంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.

Similar News

News December 14, 2025

మెస్సీకి ఎందుకంత ఫాలోయింగో తెలుసా?

image

మెస్సీ పదేళ్ల వయసులో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ (GHD)తో బాధపడ్డారు. 4 అడుగుల కంటే ఎత్తు పెరగడని డాక్టర్లు తేల్చేశారు. ఇంజెక్షన్లకు నెలకు $900-1,000 కావడంతో అతడి కుటుంబం భరించలేకపోయింది. స్పెయిన్‌లోని FC బార్సిలోనా అతడి టాలెంట్‌ను గుర్తించి తమ అకాడమీలో జాయిన్ చేసుకోవడంతో పాటు ట్రీట్మెంట్ చేయించింది. ఆ తర్వాత స్టార్ అయిన మెస్సీ ఫౌండేషన్ స్థాపించి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ప్రపంచకప్ కూడా గెలిచారు.

News December 14, 2025

నెలకు రూ.20వేలు.. రేపటి వరకే ఛాన్స్

image

RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్-2026 (3 నెలలు) దరఖాస్తుల గడువు రేపటితో (DEC 15) ముగియనుంది. PG, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, LLB, ఎకనామిక్స్, ఫైనాన్స్, కామర్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్టుల్లో డిగ్రీ చేస్తున్న వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి RBI ఆఫీసుల్లో పని చేసే అవకాశం, నెలకు రూ.20వేలు స్టైఫండ్ లభిస్తుంది.
వెబ్‌సైట్: <>opportunities.rbi.org.in<<>>

News December 14, 2025

అత్యధిక స్థానాలు మావే: పీసీసీ చీఫ్

image

TG: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమష్టిగా కష్టపడ్డారని చెప్పారు. గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ పాలనపై నమ్మకం ఉంచారని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా సర్కారు ముందుకు సాగుతోందని వివరించారు.