News September 8, 2025
రూ.94వేల కోట్లలో రూ.250 కోట్లు నష్టం: కేటీఆర్

కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని KTR విమర్శించారు. ‘మేడిగడ్డను రెండేళ్లుగా పక్కనబెట్టారు. కాళేశ్వరం కోసం రూ.94వేల కోట్లు ఖర్చు అయితే మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగి రూ.250 కోట్ల నష్టం జరిగింది. దాన్ని మేమే రిపేర్ చేస్తామని ఏజెన్సీ ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదు’ అని ఫైరయ్యారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లిస్తున్నారని తెలిపారు.
Similar News
News September 9, 2025
సీఎం, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు: హైకోర్టు

AP: సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ CM, సినీ నటుడు NTR విషయంలోనే అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో Dy,CM పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ IAS విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు. ఈ నెల 15కు విచారణ వాయిదా వేశారు.
News September 9, 2025
రైతు వేదికల్లోనూ యూరియా పంపిణీ: తుమ్మల

TG: యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లోనూ నిన్నటి నుంచి యూరియా పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పంపిణీ సజావుగా సాగుతున్నట్లు వెల్లడించారు. జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, దేశీయ ఉత్పత్తి తగ్గడంతో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు.
News September 9, 2025
ఏది కొనాలన్నా 22 తర్వాతే..

ఈనెల 22 తర్వాత GST కొత్త <<17605492>>శ్లాబులు<<>> అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో ‘ఏది కొనాలన్నా ఆ తర్వాతే’ అని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST పూర్తిగా ఎత్తేయడంతో ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా 22 తర్వాతే ఆఫర్లను అమలు చేయనున్నాయి.