News May 2, 2024
సూపర్-6 నుంచి రూ.4వేల పెన్షన్ మాయం: పేర్ని నాని
AP: సీఎం జగన్‌కు వస్తోన్న ప్రజాదరణ చూసి కూటమి నేతలు మాయమాటలతో మేనిఫెస్టో రూపొందించారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మేనిఫెస్టోలో మోదీ ఫొటో, ఇవాళ కొన్ని పేపర్ ప్రకటనల్లో పవన్ కళ్యాణ్ ఫొటోలను తీసేశారని చెప్పారు. గతంలో సూపర్-6లో పెన్షన్ రూ.4వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు దాన్ని కనపడకుండా చేశారని మండిపడ్డారు. ఇలా ఫొటోలతో పాటు పథకాలు కూడా మాయమవుతాయని ఎద్దేవా చేశారు.
Similar News
News December 26, 2024
మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్యం విషమం
TG: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం గుండె పోటుకు గురవ్వగా నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులు ఆయనను పరామర్శించారు.
News December 26, 2024
దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక అన్నా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. DEC 23న రాత్రి స్నేహితుడితో మాట్లాడుతుండగా ఇద్దరు దుండగులు వచ్చి అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. స్నేహితుడిని దారుణంగా కొట్టి తరిమేసి, రేప్ చేశారని, అనంతరం న్యూడ్ ఫొటోలు తీశారని తెలిపింది. TNలో మహిళలకు సేఫ్టీ లేదని BJP నేత అన్నామలై మండిపడ్డారు.
News December 26, 2024
PHOTO: క్లీంకారతో రామ్ చరణ్-ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకారతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రీ వద్ద వీరు ఫొటోకు ఫోజులిచ్చారు. అయితే క్లీంకార ముఖాన్ని కనిపించకుండా దాచేశారు. ఈ ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు. RC నటించిన గేమ్ ఛేంజర్ మూవీ JAN 10న థియేటర్లలో విడుదల కానుంది.