News May 22, 2024
పేటీఎంను వెంటాడుతున్న నష్టాలు

ఫిన్ టెక్ సంస్థ పేటీఎం FY24ను నష్టాలతో ముగించింది. చివరి త్రైమాసికంలో ఏకంగా రూ.550 కోట్ల నష్టం వాటిల్లింది. అంతకుముందు ఏడాది క్యూ4 ఫలితాల్లో ఈ నష్టం రూ.169కోట్లకే పరిమితమైంది. మరోవైపు ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ (రూ.2,267కోట్లు) సైతం అంతకుముందు ఏడాదితో (రూ.2334 కోట్లు) పోలిస్తే 3శాతం తగ్గిపోయింది. యూపీఐ చెల్లింపులు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై RBI ఆంక్షలు క్యూ4 ఫలితాలపై ప్రభావం చూపించాయి.
Similar News
News November 27, 2025
దారిద్ర్యాన్ని తొలగించే దక్షిణామూర్తి స్తోత్రం మహిమ

ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై|
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే||
దక్షిణామూర్తి స్తోత్రం అత్యంత విశిష్టమైనది. ఈ స్తోత్రం గురు శిష్యుల గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి ఇతర స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు కూడా జ్ఞాన సాధన కోసం చాలా ముఖ్యమని ఆదిశంకరాచార్యులు చెప్పినట్లు చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.
News November 27, 2025
11,639 ఉద్యోగాల భర్తీ.. హైకోర్టు కీలక ఉత్తర్వులు

AP: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 ఉద్యోగాల భర్తీపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. పోలీస్ శాఖలో 19,999 ఖాళీలున్నాయని RTI ద్వారా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని, వీటి భర్తీకి ఆదేశాలివ్వాలంటూ ఓ ట్రస్టు పిల్ వేసింది. వీటిలో 11,639 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
News November 27, 2025
ఉత్తరలో విత్తితే, ఊదుకొని తినడానికి లేదు

ఉత్తర నక్షత్రం సాధారణంగా సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదా ఆగిపోతాయి. ఆ సమయంలో విత్తితే పంట పండదు, తినడానికి ఏమీ ఉండదు. అందుకే వ్యవసాయ పనులకు సరైన సమయం ముఖ్యం. వర్షాకాలం పూర్తయ్యాక విత్తనాలు నాటితే నీరు లేక ఎలా పంట ఎండిపోతుందో.. పనులను సరైన సమయంలో, సరైన పద్ధతిలో చేయకపోతే ఫలితం ఉండదని ఈ సామెత భావం.


